నమస్తే

స్వాగతం

NewsOne కి స్వాగతం

Sign In / Register
హోమ్ రాజకీయం సినిమా క్రీడలు వ్యాపారం వార్తలు దేవాలయాలు లీగల్ వార్తలు ఆరోగ్యం

క్రీడలు

2 వార్తలు కనుగొనబడ్డాయి

క్రీడలు

ఆ ఐదుగురుకి ఇదే చివరి సీజన్ ?

అతిపెద్ద క్రికెట్ పండుగకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ 19వ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. బ్యాట్స్‌మెన్ల పరుగుల దాహానికి, బౌలర్ల వికెట్ల వేటకు మైదానలు సిద్ధమౌతున్నాయి. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరిగే పోరుతో ఈ లీగ్ అట్టహాసంగా మొదలుకానుంది. అయితే, ఈ సీజన్‌లో కొందరు స్టార్ ప్లేయర్లకు వీడ్కోలు సీజన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిగ్గజ ఆటగాళ్లు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.వయస్సు, ఫిట్‌నెస్, భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా ఐపీఎల్ 2026 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్న ఆ ఐదుగురు ఆటగాళ్లు వీరే అని విశ్లేషకులు చెబుతున్నారు. వారేవరో చదివేయండి..1. మహేంద్ర సింగ్ ధోనిఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఇదే చివరి సీజన్ కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 44 ఏళ్ల వయస్సులో ఉన్న మాహీ, మోకాలి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, సీఎస్కే కోసం తన వంతు పాత్ర పోషిస్తున్నారు. జూలైలో ఆయనకు 45 ఏళ్లు నిండనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ ధోని ఈ సీజన్ మొత్తం ఆడతారని ధృవీకరించినప్పటికీ, మాహీకి ఇదే చివరి ఐపీఎల్ మ్యాచ్ కాబోతుందని చెబుతున్నారు. ఇదే నిజం అయితే అభిమానులకు ఇది ఒక భావోద్వేగభరితమైన వీడ్కోలు కానుంది.2. సునీల్ నరైన్కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు వెన్నెముక సునీల్ నరైన్. బౌలింగ్‌లో 192 వికెట్లు, బ్యాటింగ్‌లో 1,780 పరుగులతో అల్-రౌండ్‌ ప్రదర్శన ఇస్తున్న ఈ స్టార్ వయస్సు ప్రస్తుతం 37 ఏళ్లు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆయన, పెరుగుతున్న ఫిట్‌నెస్ సవాళ్ల దృష్ట్యా ఈ ఐపీఎల్ తర్వాత లీగ్ నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.3. ఇషాంత్ శర్మటీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ (GT) తరఫున ఆడుతున్నారు. 37 ఏళ్ల ఇషాంత్ గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నారు. యువ ఫాస్ట్ బౌలర్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న తరుణంలో, ఐపీఎల్ 2026 తన కెరీర్‌లో ఆఖరి మెరుపు కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.4. అజింక్య రహానేసాంకేతికంగా అత్యంత పటిష్టమైన బ్యాటర్ అజింక్య రహానేకు కూడా ఇదే ఆఖరి సీజన్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున ఆడుతున్న రహానే, ఈ సీజన్‌లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. జూన్‌లో 38వ పడిలోకి అడుగుపెట్టనున్న రహానే, ఈ లీగ్ తర్వాత కుర్రాళ్లకు దారి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.5. మిచెల్ స్టార్క్ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన బౌలర్లలో ఒకరైన మిచెల్ స్టార్క్, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టులో ఉన్నారు. ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన స్టార్క్, టెస్ట్, వన్డే కెరీర్‌ను పొడిగించుకోవడానికి ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పనిభారం తగ్గించుకోవడంలో భాగంగా ఈ సీజన్ తర్వాత ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది.ఈ దిగ్గజ ఆటగాళ్లు తమ చివరి సీజన్‌ను టైటిల్ విజయంతో ముగించాలని పట్టుదలతో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ట్రోఫీతో వీడ్కోలు పలుకుతారో వేచి చూడాలి.

SHARAMA· 4 వారాల క్రితం
క్రీడలు

బహుముఖ ప్రజ్ఞాశాలి కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ

బహుముఖ ప్రజ్ఞాశాలి కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీవిశాఖ సిటీ, న్యూస్ వన్  :ఒకే వ్యక్తిలో ఒక సమర్థవంతమైన నాయకురాలిని, ఒక ఛాంపియన్ క్రీడాకారిణిని మరియు ఒక సామాజిక సంస్కర్తను చూడటం అరుదు. ఆ అరుదైన వ్యక్తిత్వమే పెద్దిశెట్టి ఉషశ్రీ విశాఖపట్నం 43వ వార్డు కార్పొరేటర్‌గా ప్రజా సేవలో నిమగ్నమై ఉంటూనే, బ్యాడ్మింటన్ కోర్టులో అంతర్జాతీయ స్థాయి పతకాలు సాధిస్తూ ఆమె సృష్టించిన రికార్డులు అమోఘం. ఉషశ్రీ  కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా మన దేశ జెండాను గర్వంగా ఎగురవేశారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, తన ఇష్టమైన క్రీడ బ్యాడ్మింటన్‌ను ఆమె విస్మరించలేదు. ఇటీవల ఫిబ్రవరి 2025లో విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఉషశ్రీ అద్భుత ప్రదర్శన చేశారు. 45+ ఏళ్ల విభాగంలో మహిళల సింగిల్స్, ఉమెన్స్ డబుల్స్, మరియు మిక్స్‌డ్ డబుల్స్  ఇలా మూడు విభాగాల్లోనూ బంగారు పతకాలు సాధించి ‘ట్రిపుల్ క్రౌన్’ విజేతగా నిలిచారు. గతంలోనూ సియోల్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం ఊహించారు. ప్రస్తుతం కూడా రాష్ట్రస్థాయి లో మరొక్కసారి ఛాంపియన్ గా నిలిచి తన సత్తా చాటారు.క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధ్యమే" అని నమ్మే ఉషశ్రీ ప్రతిరోజూ ఉదయం కోర్టులో ప్రాక్టీస్ పూర్తి చేసి, ఆపై వార్డు పర్యటనలకు వెళ్తుంటారు. ఆమె చూపిస్తున్న ఉత్సాహం యువతకు ఒక గైడ్ లాంటిది. సామాజిక కార్యకర్తగా కూడా ఆమె సేవలు అనన్యసామాన్యం. యంగ్ శర్మనార్ గ్లోబల్ యూనివర్సిటీ సభ్యురాలిగా విద్యా రంగంలో సంస్కరణలకు కృషి చేస్తూనే, మహిళలు ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలని పలు వేదికల ద్వారా పిలుపునిస్తుంటారు. ఇంటిని, రాజకీయాలను, మరియు క్రీడలను సమన్వయం చేసుకుంటూ ఆమె సాగిస్తున్న ఈ ప్రయాణం ప్రతి ఒక్క మహిళకు ఆదర్శం అని చెప్పవచ్చు. కార్పొరేటర్‌గా ఆమె వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. 43వ వార్డులో పారిశుద్ధ్య మెరుగుదల, డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ మరియు మహిళల భద్రత కోసం ఆమె తీసుకుంటున్న చర్యలు ప్రజల మన్ననలు పొందుతున్నాయి. కౌన్సిల్ సమావేశాల్లో వార్డు సమస్యలపై ఆమె చేసే వాదనలు ఆమెలోని ధైర్యానికి, నిబద్ధతకు నిదర్శనం అని ఈ సందర్భంగా చెప్పవచ్చు.

దామోదర్ గోవింద్ · 2 నెలల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
హోమ్
లైవ్ TV
ఈ-పేపర్
Loading Live...
లైవ్ TV (Live)