సినిమా
4 వార్తలు కనుగొనబడ్డాయి
సినిమా
5 రోజుల వరకు దాడులు చేయం: ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండు రోజులుగా ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని చెప్పారు. పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరించే దిశగా సాగుతున్నామన్నారు. ఈక్రమంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై 5 రోజుల వరకు దాడులు చేయబోమన్నారు. మరో వారం పాటు ఇరాన్‌తో చర్చలు జరగొచ్చని పేర్కొన్నారు. చర్చల ఫలితంపై ఆధారపడి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు.
టాలీవుడ్ ‘జెజమ్మ’ పెళ్ళిలో నిజంలేదు
టాలీవుడ్ ‘జెజమ్మ’ అనుష్క శెట్టి త్వరలో ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నారంటూ నెట్టింట జరుగుతున్న ప్రచారానికి ఆమె టీమ్ చెక్ పెట్టింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూనే, వ్యక్తిగత జీవితాన్ని సెన్సేషనలైజ్ చేయడంపై ఘాటుగా స్పందించింది. అనుష్క వ్యక్తిగత జీవితాన్ని ప్రతిరోజూ హెడ్‌లైన్స్‌లోకి తీసుకురావడం సరైన పద్ధతి కాదని ఆమె టీమ్ పేర్కొంది. “అనధికారిక సమాచారాన్ని పదే పదే ప్రచురించడం అన్యాయం. అన్నిటికంటే నిరాశ కలిగించే విషయం ఏమిటంటే.. ఆమె వయసును (44) ప్రతి పోస్ట్‌లోనూ ఒక వివాదాస్పద అంశంలా హైలైట్ చేయడం. హీరోల వయసు విషయంలో చూపని ఉత్సాహం, కేవలం హీరోయిన్ల విషయంలోనే ఎందుకు కనిపిస్తోంది?” అని టీమ్ ప్రశ్నించింది.అనుష్క తన కెరీర్‌ను కేవలం ప్రతిభతో, ఎంతో హుందాగా నిర్మించుకున్నారని, ఆమె ఎప్పుడూ పీఆర్ స్టంట్స్‌పై ఆధారపడలేదని ఆమె టీమ్ ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. తన పర్సనల్ లైఫ్‌ను గోప్యంగా ఉంచుకోవాలని కోరుకునే వ్యక్తిని ఇలా టార్గెట్ చేయడం సమంజసం కాదని హితవు పలికారు. “వివాహం అనేది ఒక వ్యక్తిగత విషయం. అది బ్రేకింగ్ న్యూస్ కాదు, కేవలం వ్యూస్ కోసం వాడాల్సిన అంశం అంతకంటే కాదు. ఇకనైనా బాధ్యతగా వ్యవహరించండి. ఒక వార్తను ప్రచురించే ముందు నిజాన్ని నిర్ధారించుకోండి. హీరోయిన్లను కూడా హీరోలతో సమానంగా, గౌరవంగా చూడటం నేర్చుకోండి” అని అనుష్క టీమ్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది.
మెుదటి రోజు ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ ?
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ అంచనాల మధ్య గురువారం నాడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ – పవర్ స్టార్ కాంబోలో సినిమా కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తెల్లవారుజామున ఆటతో రిలీజ్ అయినా ఈ సినిమా ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. రొటీన్ కథ, కథనం బోర్ కొట్టించింది. దాంతో బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ముఖ్యంగా పక్కనే విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్ 2’ ప్రభావం ఈ సినిమా వసూళ్లపై స్పష్టంగా కనిపించింది.అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు సుమారు రూ. 48 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆఫ్ లైన్ టికెటింగ్ కాకుండా, ఆన్ లైన్ డేటా ప్రకారం ఇండియా వైడ్ గా ఈ చిత్రం 5,359 షోల ద్వారారూ. 31.86 కోట్లు రాబట్టింది. మొదటి రోజు మొత్తం ఆక్యుపెన్సీ 68.01% గా నమోదైంది. ఆంధ్రా ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ స్టామినాకు తగ్గట్టుగా వసూళ్లు పర్వాలేదనిపించాయి. ఇక్కడ రూ. 19.40 కోట్లు వసూలు కాగా ఆక్యుపెన్సీ 68.35% గా నమోదైంది. తెలంగాణలో మాత్రం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ఇక్కడ కేవలం రూ.9.10 కోట్లు మాత్రమే రాబట్టింది. దీనికి ప్రధాన కారణం హిందీ సినిమా ‘ధురంధర్ 2’ వేవ్ అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. భారీ అంచనాలతో యూఎస్ మరియు ఇతర దేశాల్లో విడుదలైన ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో ఆశించిన ప్రభావాన్ని చూపలేకపోయింది. ఓవరాల్‌గా మొదటి రోజు ప్రదర్శన అండర్వెల్మింగ్ గానే మిగిలిందని సినీ వర్గాల అభిప్రాయం.
సినిమా వాళ్లని ఎంకరేజ్ చేయడంలో ఆంధ్రపరేశ్ వెనుకబడింది - చిరంజీవి
హైటెక్స్ లో ఘనంగా ఏర్పాటు చేసిన “తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్” వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. 2025వ సంవత్సరానికి సంబంధించి అవార్డులను అందుకున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర నటులు, గేయ రచయితలు, నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులకు పలు అవార్డులు అందజేశారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించిన ఈ అవార్డుల వేడుకకు టాలీవుడ్ తారాలోకం తరలివచ్చింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ‘సినిమా వాళ్లను ప్రోత్సహించడంలో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కొంత వెనకబడి ఉంది. చంద్రబాబు నాయుడు ‘గద్దర్ అవార్డులని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమా వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేయాలి. సినిమా వాళ్లను ఎంకరేజ్ చేయడంలో పక్క రాష్ట్రం పక్క రాష్ట్రం కొంచెం వెనకబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమకు మళ్లీ మంచి రోజులు రావాలని, కళాకారులను గౌరవించుకోవడంలో ప్రభుత్వం చొరవ చూపాలని చిరంజీవి అన్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ‘నంది అవార్డుల’ పేరును ‘గద్దర్ అవార్డులు’గా మారుస్తూ, సినిమా వాళ్లను ప్రోత్సహించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అవార్డులు ఇవ్వాలని అన్నారు. అయితే చిరు చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. గత పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అవార్డులు ఇవ్వలేదు మరి అప్పుడు చిరు ఏమి చేసారో చెప్పాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.